Share News

బీఆర్‌నగర్‌ సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:10 AM

పట్టణ పరిధిలోని బీఆర్‌ నగర్‌లోని సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలి పారు.

బీఆర్‌నగర్‌ సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్యే రవికుమార్‌కు సత్కరిస్తున్న బీఆర్‌నగర్‌ కాలనీ వాసులు

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని బీఆర్‌ నగర్‌లోని సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలి పారు. 22-ఏ నిషేధిత భూముల జాబితా నుంచి బీఆర్‌ నగర్‌ లేఅవుట్‌ తొలగింపునకు కృషి చేసిన ఎమ్మె ల్యేని బుధవారం ఎమ్మెల్యే విజన్‌ కార్యాలయంలో స్థానిక కాలనీ సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దంగా ఈ లేఅవుట్‌ 22ఏ జాబితాలో ఉండడంతో క్రయ విక్రయాలు, ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఏర్పడడంతో స్థానికుల వినతి మేరకు ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇదే మాదిరిగా కాలనీలో సదుపా యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ఏడాదిలోనే లే అవుట్‌ను 22-ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడంలో కీలక భూమిక పోషించి, ప్రజలకు తమ భూములపై హక్కును కల్పించిన ఎమ్మెల్యే రవికుమార్‌ కు సంక్షేమ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియ మితులైన పాత్రుని పాపారావును ఎమ్మెల్యే సత్కరించి అభినందించారు. కార్యక్ర మంలో బీఆర్‌ నగర్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొత్తకోట శ్రీహరి, ప్రధాన కార్యదర్శి గురుగు బెల్లి హరిబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:10 AM