Share News

అంగన్‌వాడీల హామీలు నేరవేర్చేందుకు కృషి

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:07 AM

ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్య కర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

అంగన్‌వాడీల హామీలు నేరవేర్చేందుకు కృషి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్య కర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సోమవారం విశాఖ-ఎ కాలనీలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే అంగన్‌ వాడీ సెంటర్లలో మౌలిక వసతులు మెరుగుపరిచామని, కార్యకర్తలకు 15 రోజులు వేసవి సెలవులు, ప్రతినెలా ఒకటో తేదీన వేత నాలు చెల్లిస్తున్నామన్నారు. రెండు పర్యాయాలు వేతనాలు పెంచిన ఘన త టీడీపీ ప్రభు త్వానిదేనన్నారు. చిరుద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేతనాల పెంపు విషయంలో త్వరలో శుభవార్త వింటా రన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, ఏపీఎంఎస్‌ ఎంఈ డైరెక్టర్‌ ప్రధాన విజయరాం, ఏపీడబ్లూఐడీసీ డైరెక్టర్‌ పీఎంజే బాబు, కోరాడ హరగోపాల్‌, సింతు సుధాకర్‌ పాల్గొన్నారు. 29 మంది లబ్ధిదారులకు రూ.15లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే గొండు శంకర్‌ పంపిణీ చేశారు.

దమ్మలవీధిలో అవగాహన ర్యాలీ..

నగరంలోని దమ్మలవీధిలో సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌ పర్య టించి డయేరియా నివారణపై అవగాహన ర్యాలీ చేపట్టారు. దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో పనుల కోసం ఇప్పటికే రూ.కోటి మంజూరైందని, త్వరలో మరో రూ.కోటి కేటాయించనున్నారన్నారు. ఈ నిధులతో కొత్త పైప్‌ లైన్లు, కాలువల మరమ్మతులు, సింటెక్స్‌ వాటర్‌ ట్యాంకర్‌, బోర్‌వెల్స్‌ ఏర్పాటు తదితర పనులు 15 రోజుల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:07 AM