భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:57 PM
నగరంలోని మండల వీధిలో జరుగుతున్న గురిటి పోలమ్మతల్లి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
గురిటి పోలమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన
అరసవల్లి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): నగరంలోని మండల వీధిలో జరుగుతున్న గురిటి పోలమ్మతల్లి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సదరు ఏర్పాట్లను నగర కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియం త్రణ, రహదారుల పరిశుభ్రత, తాగునీటి సరఫరా వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫ రాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహిం చాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్, నేతలు ప్రధాన విజయరాం, పిరియా మాధవి, పాలిశెట్టి మల్లిబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విశాఖ-ఎ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ వీవోఏ లకు ప్రభు త్వం మంజూరు చేసిన మొబైళ్లను మంగళవారం పంపిణీ చేశారు. సంఘం సమావే శాలు, రికార్డులు, అప్‌డేట్లు, లోన్ల వివరాలు వంటి అన్ని అంశాలను పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని, వీటిని వినియోగించు కోవాలని కోరారు.కార్యక్రమంలో టీడీపీ నేతలు లోపింటి రాధాకృష్ణ, మూకళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం’
గార, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న భూముల రీ సర్వే ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకూర్మం గ్రామ సచివాలయం వద్ద భూ సర్వే గ్రామసభ, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో భూముల రీసర్వే కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్క రించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.