Share News

శ్రీకూర్మక్షేత్రం అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:15 PM

: శ్రీకూర్మ క్షేత్రం అభి వృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న ట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు.

 శ్రీకూర్మక్షేత్రం అభివృద్ధికి కృషి
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌

- ఎమ్మెల్యే శంకర్‌

గార, ఫిబ్రవరి 3 (ఆంధ్ర జ్యోతి): శ్రీకూర్మ క్షేత్రం అభి వృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న ట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. శ్వేతపుష్కరిణి చుట్టూ జరుగుతున్న అభివృ ద్ధి పనులను దేవదాయశాఖా ధికారులు, ఇంజనీర్లతో కలిసి ఆయన మంగళవారం పరిశీలిం చారు. అనంతరం దేవస్థానం కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్తగా కాటేజీ నిర్మిస్తామని తెలిపారు. శ్వేతపుష్కరిణిని సుందరంగా మారుస్తామని అన్నారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అధి కారులు, ఇంజనీర్లు, స్తపతి ట్రస్టు బోర్డు సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

కంటి సమస్యలపై అవగాహన ఉండాలి

అరసవల్లి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులకు కంటి సమస్యలపై అవగాహన ఉండా లని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ మున్సిపల్‌ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల ము గింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లా డారు. విద్యార్థులు కంటిచూపు విషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు. డీఎంహెచ్‌వో అనిత మాట్లాడుతూ.. జిల్లాలో 855 పాఠశా లల్లో 1.08లక్షల మంది విద్యార్థులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో 5,596 మం దికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ హైస్కూల్‌కు చెందిన 27 మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందించారు. ఎంఈవోలు ఎన్‌.కృష్ణ, సుజాత, వైద్యాధికారి ప్రత్యూష, హెచ్‌ఎం భరద్వాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:15 PM