రహదారుల అభివృద్ధికి కృషి: శంకర్
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:59 PM
నగరంలోని మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తు న్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ప్రధాన బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దత్తాత్రేయ గుడి వద్ద రూ. 7.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు., అలాగే సుమారు రూ. 1.90 కోట్ల అంచనాతో డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి సింహ ద్వారం వరకు బీటీ రోడ్డు, నవభారత్ జంక్షన్ నుంచి 7 రోడ్ జంక్షన్, సూర్యమహల్, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా పెద్దపాడు హైవే వరకు బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులకు శంకుసప్థాపన చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.