క్రి కెట్ అభివృద్ధికి కృషి
ABN , Publish Date - May 21 , 2026 | 11:15 PM
క్రికెట్ అభివృద్ధికి కృషిచే స్తానని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, మే 21(ఆంధ్రజ్యోతి): క్రికెట్ అభివృద్ధికి కృషిచే స్తానని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. జిల్లా సంఘం అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న ఆయన స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల మైదానం లోగల క్రికెట్ అసోసియేషన్ భవనంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. క్రికెట్‌ను జిల్లా నలుమూలల వ్యాప్తించేవిధంగా, క్రీడాకారుల్లో చైతన్యం కలిగేవిధంగా చర్య తీసుకుంటానని పేర్కొన్నారు. క్రీడాకారులకు తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు హసన్‌రాజా, షైలానీ, రవికుమార్, ఎన్.బెనర్జీ పాల్గొన్నారు.