మౌలిక వసతుల కల్పనకు కృషి: రవికుమార్
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:29 PM
నియోజకవర్గంలో పట్టణం, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో పట్టణం, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదివారం సీఎస్పీ రోడ్డు నుంచి బొబ్బిలి పేట మీదుగా వెదుళ్లవలస వరకు రూ.1.80 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అలాగే బొబ్బిలిపేటలో ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, నారాయణపురం ఆనకట్ట డైరెక్టర్ సనపల ఢిల్లీశ్వరరావు, సర్పంచ్‌లు జి.రమణమూర్తి, బి.గౌరీపతి, టీడీపీ నాయకులు కేవీ సత్యారావు, నూకరాజు పాల్గొన్నారు.