Share News

మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే శంకర్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:22 AM

: గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో స్థానిక పెద్దలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

  మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి: ఎమ్మెల్యే శంకర్‌
తండ్యాలపేటలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌:

గార, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో స్థానిక పెద్దలతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీరు, రహదారులు, విద్యుత్‌, సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు తదితర సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక అభయాంజనేయ స్వామివారిని ఎమ్మెల్యే శంకర్‌ దర్శించుకొని.. పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:22 AM