వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేయాలి
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:22 PM
వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక శాఖ ఉప కమిష నర్ కొండలరావు కోరారు.
అరసవల్లి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక శాఖ ఉప కమిష నర్ కొండలరావు కోరారు. స్థానిక కెమిస్ట్ భవన్‌లో నేచర్ సంస్థ డైరెక్టర్ ఎస్.వికాస్‌తో కలిసి మీడి యాతో మాట్లాడారు. శ్రీకాకుళాన్ని వెట్టిచాకిరీ రహిత జిల్లాగా మారుద్దామన్నారు. పని ప్రదేశంలో శ్రమ దోపిడీ జరి గితే విజిలెన్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందిన వారికి కలెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారని, వారికి తక్షణ సహా యం కింద రూ.30 వేలు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు సహా యం అందేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిపై అవగాహన కార్య క్రమాలు నిర్వహి స్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు జి.చైతన్య, ఆర్.శ్రీను, శంకర్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.