టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:59 PM
టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్క రూ కృషిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. మండ లంలోని గొట్ట గ్రామంలో వంజరాపు సింహాచలం ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.
హిరమండలం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్క రూ కృషిచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. మండ లంలోని గొట్ట గ్రామంలో వంజరాపు సింహాచలం ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఆదివారం పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పార్టీలోకి చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ పొగిరి బుచ్చిబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యాళ్ళ నా గేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు ఢిల్లేశ్వరరావు, బర్రి సురేష్ పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించుకుంటాం
పాతపట్నం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఎంతో నమ్మకంతో చేరిన నాయకులు నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించుకుంటామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం పాతపట్నంలోని క్యాంపు కార్యాలయం లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మెళియాపుట్టి మండలంలోని శేఖరాపురం పంచా యతీ పరిధిలోని 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈమేరకు వారికి టీడీపీ కం డువాలు వేసి గోవిందరావు స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన గోక వనజాక్షి, గోక మోహనరావు ఆధ్వర్యంలో, కొర్నాన హరీష్, పేరఇంద్రుడు, పాపయ్య, అక్కరాడ భీముడు, పొన్నాడ నారాయణలతో సుమారు 50 కుటుంబాలు చేరాయి.