Share News

ఇచ్ఛాపురం అభివృద్ధికి కృషిచేయాలి

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:38 PM

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలచెట్టుకుంటూ ఇచ్ఛాపురం పట్టణ అభివృద్ధికి అంకిత భా వంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు.

ఇచ్ఛాపురం అభివృద్ధికి కృషిచేయాలి
మంత్రిని కలిసిన ఆశి లీలావతి, కూటమి నాయకులు

  • మంత్రి అచ్చెన్నను కలిసిన చైర్‌పర్సన్‌ ఆశి లీలావతి

కోటబొమ్మాళి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలచెట్టుకుంటూ ఇచ్ఛాపురం పట్టణ అభివృద్ధికి అంకిత భా వంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తర ఫున ఇచ్ఛాపురం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆశి లీలా వతి బుధవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న ఆమెకు అభినం దనలు తెలియజేసి పలు సూచనలు చేశారు. చైర్‌పర్సన్‌గా లభించిన అవకాశాన్ని పదవిగా కాకుండా ప్రజాసేవకు లభించిన అవకాశం భావించి పనిచేయాలన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వ హణ, తాగునీటి సరఫరా, రహదా రుల అభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాల ని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్ప టికప్పుడు తెలుసుకుంటూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టీడీపీ బలోపేతానికి, కూటమి విజయానికి నిస్వా ర్థంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పార్టీశ్రేణులందరినీ కలుపుకొని పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆమెకు సూచించారు. కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:38 PM