పట్టణాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:51 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మునిసి పాలిటీ తో పాటు మండలాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇచ్ఛాపురం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మునిసి పాలిటీ తో పాటు మండలాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రైతులకు 2 ట్రాక్టర్లు, 21 పంచాయతీలకు 21 చెత్త సేకరణ రిక్షాలు అందించారు. పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పట్టణం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూట మి ప్రభుత్వం వచ్చిన తరువాత అభి వృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. డి గ్రేడ్‌లో ఉన్న ముని సిపాలి టీలో తాగునీరు, బ్యూటిఫికేషన్ లేని పరిస్థితుల్లో అమృత్ 2.0(ఓ) అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశా మన్నారు. పట్టణానికి ప్రధానంగా తాగునీటి సమస్య మొదటినుంచి ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అంద రికీ తాగునీరందించామన్నారు. బెల్లుపడ కొఠేరి బందకు రూ. 1.41 కోట్లతో బ్యూటిఫికేషన్, బండ్ అభివృద్ధికి అమృత్ 2.0 నుంచి నిధులు తీసుకు రావడం జరిగిందన్నారు. అలాగే స్వచ్ఛమిషన్‌లో హాగంగా డంపింగ్ యార్డ్ పనులు, కాలనీల్లో బోరువెల్స్‌కు శంకుస్థాపనలు చేశామన్నారు. పట్టణంలో సెంటర్‌లైటింగ్ విషయంలో కాస్త ఆలస్యం జరిగిందని, పాత స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు వేసి పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. వైసీపీ హయాంలో ఇచ్ఛాపురంలో బ్యూటిఫి కేషన్‌కు ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు వైస్ చైర్‌పర్సన్ కుర్చీకోసం పోరాటం చేశారు తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్, ఎంపీడీవో ప్రభాకర రావు, జన సేన ఇన్‌చార్జి దాసరి రాజు, రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శఽంకర్‌రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పత్రి తవిటయ్య, ఎన్.కోటి, పీఏసీఎస్ అధ్యక్షుడు పెదిని బాబ్జీ, టీడీపీ నాయకులు లోపింటి పద్మనాభం, మేరుగు సూర్యనారాయణ, సహదేవ్, డిల్లీరావు, రామారావు, లోహిదాస్, ఎంపీపీ బోర పుష్ప తదితరులు పాల్గొన్నారు.