స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - May 03 , 2026 | 12:06 AM
రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి వందశాతం ఫలితాలు సాధించి విజయకేతనం ఎగర వేయాలని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
ఎచ్చెర్ల, మే 2 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి వందశాతం ఫలితాలు సాధించి విజయకేతనం ఎగర వేయాలని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ధర్మవరం గ్రామంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలనుంచి వినతలు స్వీకరించి అక్కడక్కడే సంబంధిత అధికారు లతో మాట్లాడి పరిష్కారానికి చర్య లు చేపట్టారు. ఇటీవల పదోతరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సత్కరించారు. గ్రామస్థాయిలో కూటమి నేతలతో సమన్వ యంగా పనిచేస్తూ వందశాతం ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చౌదరి నారాయణమూర్తి, డీసీఎంఎస్ అధ్యక్షుడు చౌదరి అవినాష్, టీడీపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు బెండు మల్లేశ్వరరావు, వావిలిపల్లి రామ కృష్ణ, నేతలు పైడి నూకరాజు, రుప్ప రమేష్ తదితరులు పాల్గొన్నారు.