సమర్థవంతంగా డైనమిక్ బీట్ సిస్టమ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:53 PM
Investigation of pending cases to be expedited పూర్తిస్థాయిలో నేర నియంత్రణకుగాను రాత్రివేళల్లో డైనమిక్ బీట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు.
పెండింగ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలి
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): పూర్తిస్థాయిలో నేర నియంత్రణకుగాను రాత్రివేళల్లో డైనమిక్ బీట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ‘ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తు విచారణ వేగవంతం చేసి పరిష్కరించాలి. నాన్‌బెయిలబుల్ వారెంట్స్‌పై సమీక్ష నిర్వహించి.. పెండింగ్ వారెంట్లను తక్షణమే అమలు చేయాలి. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను గుర్తించి కోర్టులో హాజరుపర్చాలి. రాత్రి బీట్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తూ.. అవసరమైన ప్రాంతాల్లో బీట్ సంఖ్యను పెంచాలి. తరచూ నేరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలి. సాంకేతిక పరిజ్ఞానంతో మిస్సింగ్ కేసులను వేగవంతంగా చేధించాలి. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను కోర్టు ఆదేశాల మేరకు చట్టబద్ధంగా డిస్పోజ్ చేయాలి. ప్రజా ఫిర్యాదులు నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఆన్‌లైన్ పోర్టల్స్‌లో సమాచార నమోదు విధానాన్ని మెరుగుపర్చాలి. మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి. సైబర్ నేరాల నియంత్రణపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల’ని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, భవానీ, ఎస్‌బీ టాస్క్‌ఫోర్స్ డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు ఇమ్మాన్యూయేల్ రాజు, కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.