విద్యాసంస్థలు బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:07 AM
Schools, colleges bund నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు, కొన్ని ప్రభుత్వ విద్యాలయాలు శుక్రవారం మూతపడ్డాయి
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు, కొన్ని ప్రభుత్వ విద్యాలయాలు శుక్రవారం మూతపడ్డాయి. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, అఖిలభారత యువజన సమాఖ్య తదితర విద్యార్థి, యువజన సంఘాలు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పురుషులు)లో తరగతులు నిర్వహించగా.. విద్యార్థి సంఘ నాయకులు అక్కడకు వెళ్లారు. ఆయా కళాశాలల విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపించేశారు. శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, సోంపేట, కోటబొమ్మాళి తదితర పట్టణాల్లో ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి.