స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:08 AM
డ్వాక్రా మహిళలు చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసు కుని స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించవ చ్చని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు.
డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్
గార, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళలు చిన్నతరహా యూనిట్లు ఏర్పాటు చేసు కుని స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించవ చ్చని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు. శని వారం రామచంద్రాపురం, అంబటివానిపేట, అం పోలు గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీలు నిర్వహిస్తున్న స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించారు. మి ల్లెట్స్, పిండిమిల్లులు, స్వీట్స్, పశువుల దాణా, వర్మీ కంపోస్టు, సిమెంట్ ఇటుకలు, పౌల్ర్టీ, డెయిరీ, గొర్రెల పెంపకం తదితర యూనిట్ల నిర్వహణపై ఆరా తీశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమ య్యేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం వి.సుజాత, సీసీలు, సీఎఫ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.