Share News

మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యం: శంకర్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:27 PM

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యం: శంకర్‌
గార: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

గార, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. రామచంద్రాపురం పంచాయతీ సిమ్మపేటలో శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం నిర్వహించారు. ఎస్‌హెచ్‌జీల ‘మన డబ్బులు, మన లెక్కల కార్యక్రమం’పై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పొదుపు అలవాటు చేసుకోవడంతో పాటు సంఘాల నిధులను సక్ర మంగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం వి.సుజాత, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామ సచివాలయం వద్ద ఎమ్మెల్యే శంకర్‌ మొక్కలు నాటారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండ: రవికుమార్‌

బూర్జ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మహిళ ల ఆర్థిక స్వావలం బనకు ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండ ల కేంద్రంలో ఎస్‌హెచ్‌జీ సంఘాల ఆధ్వర్యంలో ‘మన డబ్బులు-మన లెక్కలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రతి రూపాయి పొదుపు, లావాదేవీల లెక్కలు పారదర్శకంగా నిర్వహించడం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఆనెపు రామకృష్ణ, ఏపీఎం బాబూరావు, ఎంపీడీవో తిరుపతిరావు, ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకతకు యాప్‌లు దోహదం: అశోక్‌

కవిటి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): స్వయం సంఘా ల లావాదేవీల్లో పారదర్శకతకు యాప్‌లు దోహ దం చేస్తా యని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే, బెందా ళం అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో శుక్రవారం స్వయం సంఘాల మన డబ్బులు-మన లెక్కలు సూపర్‌నారీ యాప్‌ను ప్రారంభించారు. జిల్లాలో 15 మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏపీఎం గోవింద్‌, కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్నబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, నేతలు సంతోష్‌ పట్నాయక్‌, ఎ.రాజు, టి.హరనాద్‌, పాండు దొళాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:28 PM