Share News

ఈసీ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:54 PM

న్నికల నిర్వహణలో రిటర్నింగ్‌ అధి కారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల సంఘం నిర్ధేశించిన నిబంధనలు, మార్గ దర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. శనివారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణనిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఅధికారి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.

ఈసీ నిబంధనలు పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌::

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్‌ అధి కారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల సంఘం నిర్ధేశించిన నిబంధనలు, మార్గ దర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. శనివారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణనిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఅధికారి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ ఖాన్‌, డీఆర్వో విశ్వేశ్వరరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, శేషగిరిరావు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీలు సహకరించాలి

జిల్లాలో జరగనున్న మునిసిపల్‌, పరిషత్‌, పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాం తంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు.శనివారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో రెండు వేర్వేరు పార్టీలు ప్రచారం చేయకుండా ముందస్తు పోలీసు అనుమతితో వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించుకోవాలని కోరారు. సమావేశంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, డీపీవో స్వరూపరాణి పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:54 PM