Share News

ఈసీ మార్గదర్శకాలు పాటించాలి

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:57 PM

న్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి అధి కారి తమకు కేటాయించిన విధులను, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌, అదనపు ఎన్నికల అథారిటీ అధికారి జి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

ఈసీ మార్గదర్శకాలు పాటించాలి
మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌

శ్రీకాకుళం అర్బన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి అధి కారి తమకు కేటాయించిన విధులను, బాధ్యతాయుతంగా నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌, అదనపు ఎన్నికల అథారిటీ అధికారి జి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలోని అంబే డ్కర్‌ ఆడిటోరియంలో నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న రెండో సాధారణ మునిసిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా, పార దర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణనిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌రోజున పీవోలు, ఏపీవోలు నిర్వహించాల్సిన బాధ్యతలు, ఏర్పాట్లు, ఓటర్ల గుర్తింపు, ఓటింగ్‌, ఎన్నికలరికార్డుల నిర్వహణ, ఎన్నికల సామగ్రి వినియోగం, భద్రపరిచే విధానాలపై వివరిం చారు. శిక్షణలో భాగంగా మాస్టర్‌ ట్రైనర్లు ఆధ్వర్యంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. మాక్‌ పోలింగ్‌ ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురయ్యేపరిస్థితులపై ఽఅధికారులకు అవగాహన కల్పించారు.

Updated Date - Nov 20 , 2026 | 11:57 PM