ఘనంగా ధరిత్రీ దినోత్సవం
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:09 AM
జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వాతావరణ సమతుల్యత తదితర అంశాలపై అధికారులు, వక్తలు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వాతావరణ సమతుల్యత తదితర అంశాలపై అధికారులు, వక్తలు వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: రమేష్
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్ అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భం గా బుధవారం పట్టణంలో పురపాలకసంఘం, జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో ‘సేవ్ ఎర్త్.. సేవ్ ఫ్యూచర్’ నినాదంతో వాక్‌థాన్ ర్యాలీ నిర్వహించారు. జేసీఐ క్లబ్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడా ల్సిన అవస రాన్ని వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో విలియమ్స్, ఎంఈవో సూర్యారావు, డాక్టర్ ఉలాల శేషుయాదవ్, కాళ్ల జయదేవ్, సంతోష్‌సాహు, షణ్మఖరావు, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు. అలాగే పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సూర్యారావు ఆధ్వర్యంలో ‘బడిపిలుస్తోంది’ నిర్వహించారు. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని డిప్యూటీ డీఈవో విలియమ్స్ కోరారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘ప్రకృతిని కాపాడుకుందాం’
కంచిలి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రకృతికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బూరగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ముప్పన సోమేశ్వరరావు అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో ఽప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మానవ తప్పిదాల వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో సమూల మార్పులు సంభవిస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ మొక్క లను నాటి వాటిని పెంచే బాధ్యతను స్వీకరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పుడమి సంరక్షణను రైతులు తీసుకోవాలి: కరుణశ్రీ
గుజరాతీపేట, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పుడమి సంర క్షణ బాధ్యతను రైతులు తీసుకో వాలని ఏపీ కాలుష్య నియంత్ర ణ మండలి పర్యావణ ఇంజ నీర్ కరుణశ్రీ అన్నారు. ప్రపం చ ధరిత్రీ దినోత్సవాన్ని బుధ వారం డా.రెడ్డీస్ ఫౌండే షన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో లావేరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమి, నీరు, గాలి కాలుష్యాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రి య వ్యవసాయం చేపట్టడం ద్వారా మట్టి కాలుష్యా న్ని తగ్గించవచ్చన్నారు. ముఖ్య మంత్రి ఆదేశల మేరకుఈజ్ ఆఫ్ డూయింగ్ బిజి నెస్‌లో భాగంగా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులిస్తున్నామని చెప్పారు. సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ మొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో హెచ్‌ఎం పి.జగన్నాథరావు, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు నాయుడు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణతో సుస్థిర భవిష్యత్: ప్రసాద్
అరసవల్లి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): పర్యా వరణ పరిరక్షణతో సుస్థిర భవిష్యత్ సాధ్య మని, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను స్వీకరిం చాలని రెడ్‌క్రాస్ విజయనగరం జిల్లా చైర్మన్ కేఆర్‌డీ ప్రసాద్ అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నగరం లో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రకృతిని కాపాడుకోవడం మనం దరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో కె.శివశంకర్, రెడ్ క్రాస్ సభ్యులు చిన్మయి రావు, నిక్కు అప్పన్న, శ్రీకాంత్, వైకుంఠరావు, జి.రమణ, చైతన్యకుమార్, ఆదిత్య మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
భూమి ఆకారంలో మానవహారం
కవిటి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. భూమి ఆకారంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. భూమిపై ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని భూమిని కాపాడాలని హెచ్‌ఎం ఎన్.విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.