Share News

తపాలా ఏజెంట్లుగా డ్వాక్రా మహిళలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:59 PM

డ్వాక్రా సంఘాల లీడర్లు, సభ్యులు పోస్టల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్లుగా చేరేందుకు అవకాశం ఉందని, దీనివల్ల అదనపు ఆదాయం పొందవచ్చని శ్రీకా కుళం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వండాన హరిబాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడు దల చేశారు.

తపాలా ఏజెంట్లుగా డ్వాక్రా మహిళలు

దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 31

పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వండాన హరిబాబు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల లీడర్లు, సభ్యులు పోస్టల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్లుగా చేరేందుకు అవకాశం ఉందని, దీనివల్ల అదనపు ఆదాయం పొందవచ్చని శ్రీకా కుళం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వండాన హరిబాబు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడు దల చేశారు. పీఎల్‌ ఐతో పది రకాల భద్రతలతో పాటు ఆకర్షణీయమైన బోనస్‌ ప్రయోజనాలుంటా యన్నారు. ఆసక్తి ఉన్న 18 నుంచి 50 ఏళ్ల వయసున్న 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నారు ఎంపికైన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని, వారికి అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం తపాలా శాఖ అందజేస్తుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్‌, పాన్‌కార్డు, పదో తరగతి మార్కుల జాబితా జిరాక్స్‌ ప్రతులతో కూడిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీలోగా స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా సూపరంటెండెంట్‌, తపాలాశాఖ, శ్రీకాకుళం కార్యాలయానికి పంపాలని కోరారు. చిరు వ్యాపా రులు, చేనేత కళాకారులు, స్వయం సంఘాల వారు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేం దుకు డాక్‌ నిర్యాత్‌ కేంద్రాల ద్వారా ప్యాకింగ్‌ కస్టమ్స్‌ ఒకే చోట కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:59 PM