Share News

సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:04 AM

సమర్ధవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు కోరారు. ఈమేరకు గురువారం మండల కేంద్రాల్లో పోలింగ్‌ అధికారులకు శిక్షణ నిర్వహించారు.

సమర్ధవంతంగా విధులు నిర్వహించాలి
నందిగాం: స్టేజ్‌-1 అధికారుల నుద్దేశించి మాట్లాడుతున్న ఎంపీడీవో కుమార్‌ పట్నాయక్‌ :

సమర్ధవంతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు కోరారు. ఈమేరకు గురువారం మండల కేంద్రాల్లో పోలింగ్‌ అధికారులకు శిక్షణ నిర్వహించారు.

ఫ పాతపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక మండలపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో స్టేజ్‌-1 ఎన్నికల అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈసం దర్భంగా నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి వివరించారు. అభ్యర్థులకు నియమావళిపై అవగాహన కలిగించాల న్నారు. కార్యక్రమంలో సీఐ. కె.వెంకటరావు, పరిపాలనాధికారి తిరుపతి పట్నాయక్‌, ఎస్‌ఐ కె.మధుసూదనరావు పాల్గొన్నారు.

ఫనరసన్నపేట, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అధికారులకు గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్వో అనురాధ, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో వెంకటేష్‌ప్రసాద్‌,ఎంఈవో దాలినాయుడు పాల్గొన్నారు.

ఫపోలాకి, నవంబరు, 12(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళిని ఎన్నికల అధికారులు తూచ తప్పక పాటించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటమధు తెలిపారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్‌ అధికారులకు శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రకాష్‌, పంచాయతీ అఽధికారి బట్టపద్మావతి, డిప్యూటీ ఎంపీడీ సంద్యారాణి పాల్గొన్నారు.

ఫనందిగాం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌, వార్డుల నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎంపీడీవో యు.కుమార్‌పట్నాయక్‌ సూచిం చారు. నందిగాం జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంగా స్టేజ్‌-1 అధికారులకు(రిటర్నింగ్‌ అధికారులు) శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా మాస్టర్‌ ట్రైనీలు బి.లోకనాధం, శ్రీనివాసరావు, టి.కుమారస్వామిలు పలు అంశాలపై వివరించారు. శిక్షణలో ఉప ఎంపీడీవో టి.హరికృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:04 AM