Share News

చంద్రబాబు పాలనలోనే పేదోడికి భరోసా

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:51 AM

పేదోడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భరోసా దొరుకుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

చంద్రబాబు పాలనలోనే పేదోడికి భరోసా
లబ్ధిదారులకు చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం జనవరి 12(ఆంధ్రజ్యోతి) పేదోడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భరోసా దొరుకుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. గత వైసీపీ పాలనలో ఏనాడూ పేదోడి పక్షాన నిలి చే పాలకులు గానీ నాయకులు గానీ కానరాలేదని ఆరోపించారు. పాతపట్టణానికి చెందిన తడివేట్ల అప్పారావుకు రూ.66,008, తాడేల సాన్వికకు రూ.42,561, పతివాడ త్రినాథరావుకు రూ.1,31,524, పాతపట్నం మండలం పెద్దలోగిడి గ్రామానికి చెందిన మండల విజ యలక్ష్మికి రూ.1,04,157 చొప్పున సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులటు పంపిణీ చేశా రు. ఆయా కుటుంబ స భ్యులు అనారోగ్యాలకు గురై వైద్యసహాయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను ఆశ్రయించగా సీఎం సహా యనిధి ద్వారా వారికి ఆర్థిక సాయాన్ని అందిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్‌, మడ్డు రామారావు, శివాల చిన్నయ్య, దువ్వారి ఉదయ్‌ భాస్కర్‌, అక్కంద్ర సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:51 AM