రోడ్డుపైనే చెత్త డంపింగ్
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:11 AM
టెక్కలికి ఆనుకొని ఉన్న తొలుసురుపల్లి పంచాయతీకి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు.
టెక్కలిరూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): టెక్కలికి ఆనుకొని ఉన్న తొలుసురుపల్లి పంచాయతీకి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. వాస్తవానికి టెక్కలిలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సిఉంది. అయితే టెక్కలి పంచాయతీకి నిర్దిష్టమైన డంపింగ్‌యార్డు లేకపోవడంతో ఎన్టీఆర్‌కాలనీ, శ్రీనివాసనగర్ తదితర వీధులు నుంచి సేకరించిన చెత్తను తొలుసురుపల్లికి వెళ్లే మార్గంలో చెరువు పక్కన వేసేస్తున్నారు. చెత్త రోజుల తరబడి నిల్వ ఉండడంతో వర్షానికి తడిచి, ఎండకు ఎండుతుండడంతో దుర్వాసన వెలువడుతోందని, దీనికితోడు చెత్త చెరువులోకి చేరుతుండడంతో నీరు కంపు కొడు తోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈమార్గంలో అక్కవరం, తొలుసురుపల్లి, భగవాన్‌పురం, చింతలగార, కొత్తపేటనుంచి వందలాది మంది టెక్కలి వస్తుంటారు. కాగా కార్యదర్శి తెలియజేసి పరిశుభ్రంగా చేయి స్తామని ఈవోపీఆర్డీ సింహాద్రి తెలిపారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఎన్‌హెచ్ పక్కన ఉన డంపింగ్ కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు.