Share News

పైపులైన్ల నిర్వహణ లేక.. పంపుహౌస్‌ వద్ద బోర్లు పాడై

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:52 PM

నరసన్నపేటలో ప్రజలు కొద్ది రోజులుగా తాగునీటికోసం అవస్థలకు గురవుతున్నారు. దేవాది నుంచి నరసన్నపేటకు తాగునీరు సరఫరా అవుతోంది.

 పైపులైన్ల నిర్వహణ లేక..  పంపుహౌస్‌ వద్ద బోర్లు పాడై
సంతోషిమాత ఆలయం పరిసరాల్లోగల కుళాయి వద్ద తాగునీటిని సేకరించేందుకు అవస్థలు పడుతున్న మహిళలు

నరసన్నపేట, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ప్రజలు కొద్ది రోజులుగా తాగునీటికోసం అవస్థలకు గురవుతున్నారు. దేవాది నుంచి నరసన్నపేటకు తాగునీరు సరఫరా అవుతోంది. దేవాది నుంచి నరసన్నపేటకు వచ్చే మార్గంలో పలు ప్రాంతాల్లో పైపులైన్లు సరిగ్గా నిర్వహణ లేకపోవడంతో పాటు పంపుహౌస్‌ వద్ద బోర్లు, మోటార్లు తరచుగా పాడవుతున్నాయి. దీంతో తాగునీరు పంపిణీ సక్రమంగా సాగడంలేదు. ఈ నేపథ్యంలో పట్టణంలో వజ్రంపేట, మారుతీనగర్‌, శ్రీరామనగర్‌, పచోరి కాలనీ, లెప్పర్సీకాలనీ, వీరన్నాయుడుకాలనీ తదితర కాలనీలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీనికితోడు పంచాయతీ సిబ్బంది తాగునీటి సర ఫరాపై పర్యవేక్షణ లేక పోవడంతో కూడా నీటి కష్టాలు తప్పడంలేదని పలువురు వాపోతున్నారు. పలు వీధుల్లో కొళాయిల్లో నీరు పూర్తిస్థాయిలో తాగునీరు రావడంలేదు. మరికొన్ని వీధుల్లో చుక్కలు వస్తుండడంతో పైపులను నోటీలో పెట్టి ఉదాల్సివస్తోందని పలువురు మహి ళలు చెబుతున్నారు. తక్షణమే పైపులైన్లు నిర్వహణ, పంపుహౌస్‌వద్ద బోర్లు, మోటార్లు మరమ్మతుచేసి నీటిసరఫరాపై సిబ్బంది దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:52 PM