Share News

పార్టీ కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:15 AM

పార్టీ ప టిష్ఠత కోసం పనిచేసేవారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

పార్టీ కోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • టీడీపీలో చేరిన 100కుపైగా వైసీపీ కుటుంబాలు

పాతపట్నం/రూరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): పార్టీ ప టిష్ఠత కోసం పనిచేసేవారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో చాకిపల్లి గ్రామానికి చెందిన వంద కుటుంబాలకు పైబడి వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వండాన శేఖర్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ రాంబుక్త రాము, వార్డు మెంబర్లు కాళ్ల అప్పారావు, బోను రామారావు, కనకల సోమేశ్వరరావు, కొత్త షన్ముఖరావు, రశ్న బుయ్య తదితరులు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కుండవా వేసి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల నలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా ప్రజల కు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:15 AM