Share News

తప్పతాగి యువకుడి హల్‌చల్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:24 PM

పాత జాతీయ రహదారి జామియా మసీదు రోడ్డులో శనివారం సాయంత్రం ఓ యు వకుడు తప్పతాగి హల్‌చల్‌ చేశాడు.

 తప్పతాగి యువకుడి హల్‌చల్‌
ప్రైవేట్‌ కళాశాల బస్సు కింద పొర్లుతున్న యువకుడు

-బస్సుకింద పొర్లుతూ బీభత్సం - స్తంభించిన ట్రాఫిక్‌

పలాస, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పాత జాతీయ రహదారి జామియా మసీదు రోడ్డులో శనివారం సాయంత్రం ఓ యు వకుడు తప్పతాగి హల్‌చల్‌ చేశాడు. కళాశాలబస్సు కింద పొర్లుతూ బీభత్సం సృష్టించాడు. దీంతో అరగంటపాటు రో డ్డుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్తంభించింది. కాశీబుగ్గ పోలీసులు చేరుకొని అతికష్టంపై ఆయన్ను పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. పద్మనాభపురం కాలనీకి చెందిన సోమేలు అనే యువకుడు రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రైవేటు కళాశాలకు చెందిన ఓ బస్సు డ్రైవర్‌తో ఆయనకు వాగ్వాదం జరి గింది. తనకు అన్యాయం జరిగిం దంటూ బస్సుకింద దూరిపోయి నిలుపు దల చేశాడు. దీనిపై ప్రశ్నించిన స్థానికులతో కూడా వాదనకు దిగాడు. ఈ సంఘటనలో మొత్తం ఆ ప్రాంతంలో స్కూల్‌బస్సులతో పాటు వివిధ వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు చేరుకొని ఆయువకున్ని అతికష్టంపై బస్సు కిందనుంచి బయటకు తీశారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించారు. మధ్యం మత్తులోనే ఈ విధంగా ప్రవర్తించినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం అతన్ని బయటకు పంపించడంతో కథ సుఖాంతమైంది.

Updated Date - Jul 04 , 2026 | 11:24 PM