Share News

మాదకద్రవ్యాలపై నిఘా

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:53 PM

Alert at the check-post ‘ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. గంజాయి, గుట్కా, ఒడిశా మద్యం లాంటి మాదకద్రవ్యాలు తరలిపోకుండా అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు.

మాదకద్రవ్యాలపై నిఘా
చెక్‌పోస్టు వద్ద సీఐతో మాట్లాడుతున్న ఐజీ గోపీనాథ్‌ జట్టీ

చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలి

ఐజీ గోపీనాథ్‌ జట్టీ

ఇచ్ఛాపురం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. గంజాయి, గుట్కా, ఒడిశా మద్యం లాంటి మాదకద్రవ్యాలు తరలిపోకుండా అప్రమత్తంగా ఉండాల’ని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపినాథ్‌ జట్టి పోలీసు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పురుషోత్తపురం చెక్‌పోస్టును ఐజీ ఆకస్మికంగా తనఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద భద్రతా ఏర్పాట్లు, వాహనాల తనిఖీ, రికార్డులను పరిశీలించారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాత్రివేళ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. నిషేధిత వస్తువులు రవాణా కాకుండా.. మరింత నిఘా పెంచి.. అనుమానాస్పదంగా కనిపించిన వాహనదారులను తనిఖీ చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నమనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:53 PM