పైపులైన్లు లీకులతో తాగునీటికి అవస్థలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:08 AM
మండలంలోని 22 పంచాయతీల పరిధిలోగల గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు లక్ష్మీనర్సుపేట సమీ పంలోని వంశధార నది ఒడ్డున మెగా రక్షిత నీటి పఽథకం ఏర్పాటుచేసినా పైపు లైన్ల లీకుల పుణ్యమాని వర్షాకాలంలోనూ తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. అఽధికారులు లీకులమయమైన పైపులైన్లకు మరమ్మతులు చేసి రక్షిత నీటి పఽథకం ద్వారా తాగునీరందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎల్.ఎన్.పేట, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని 22 పంచాయతీల పరిధిలోగల గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు లక్ష్మీనర్సుపేట సమీ పంలోని వంశధార నది ఒడ్డున మెగా రక్షిత నీటి పఽథకం ఏర్పాటుచేసినా పైపు లైన్ల లీకుల పుణ్యమాని వర్షాకాలంలోనూ తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. అఽధికారులు లీకులమయమైన పైపులైన్లకు మరమ్మతులు చేసి రక్షిత నీటి పఽథకం ద్వారా తాగునీరందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
పాతపట్నం నియోజకవర్గంలోని పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, హిర మండలం, ఎల్.ఎన్.పేట మండలాల ప్రజలకు ఉద్దానం నీటి పఽథకం ద్వారా నీరందించేందుకు యంత్రాలతో పైపులైన్లు వేసేందుకు పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా వంశధార నది ఒడ్డున ఉన్న మెగా రక్షిత నీటి పథకానికి సంబం ధించిన పైపులైన్లు అడుగడుగునా పాడయ్యాయి. అవి లీకులు కావడంతో 22 పంచా యతీల్లోని గ్రామాలకు తాగు నీరందని పరిస్థితి నెలకొంది. దీంతో పలు గ్రామాల ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తురకపేట, దబ్బపాడు, స్కాట్‌పేట, కృష్ణాపురం, శ్యామలాపురం, డొంకల బడవంజ, సుమంతాపురం, ఉప్పరపేట తదితర గ్రామాల ప్రజలు వర్షాకాలంలోనూ తాగునీటికి ఇబ్బందిపడుతున్నారు.