తాగునీటి సరఫరాకు బ్రేక్
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:44 PM
పొందూరు పట్టణంలో 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
పొందూరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పొందూరు పట్టణంలో 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో 30 శాతం కుటుంబాలు ఇక్కట్లకు గురవుతున్నాయి. గత నెలలో వాయు గుండం ప్రభావంతో వీచిన గాలులకు పైప్‌లైన్‌కు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ పాడైంది. అయితే విద్యుత్ శాఖ, సిబ్బంది పట్టించుకోకపోవడంతో నేటికీ మరమ్మతులకు నోచుకో లేదు. దీంతో తాగు నీటికి వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పంచాయతీ అధికారులు సమస్యపై విద్యుత్‌శాఖాధి కారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం కనిపించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు సమయం పడుతుందని ట్రాన్స్‌కో సిబ్బంది చెప్పడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.