నువ్వలరేవులో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:06 AM
నువ్వలరేవు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవా లు ఓవైపు సందడిగా జరుగుతుంతే.. మరోవైపు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి.
పది రోజులుగా నిలిచిన సరఫరా
ఉత్సవాలు వేల తప్పని ఇబ్బందులు
పట్టించుకోని యంత్రాంగం
వజ్రపుకొత్తూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): నువ్వలరేవు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవా లు ఓవైపు సందడిగా జరుగుతుంతే.. మరోవైపు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఉగాది నుంచి 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు గ్రామంలో ఏటా నిర్వహిస్తుంటారు. దీంతో ఇతర పాంతాల్లో ఉంటున్నవారంతా స్వగ్రామానికి చేరు కుని ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమ యంలో తాగునీటి కష్టాలు ఎదురువ్వడంతో గ్రామ స్థులు నానా కష్టాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటూ అవస్థలకు గురవుతున్నారు. కొంతమంది రిక్షాలపై, వాహనాల పై మరికొందరు తలలపై బిందెలు పెట్టుకు నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్స వాలు నేపథ్యంలో నువ్వలరేవు గ్రామంలో దాదాపు 10 వేలకుపై బడి జనాభా ఉన్నా రు. గ్రామంలో ఉన్న తాగు నీటి బావులు ఎండిపోవడంతో వీరం తా ఉద్దానం ప్రాజెక్టు, జల్ జీవన్ పథకం ద్వారా సరఫరా అయ్యే నీటి పైనే ఆధారపడుతున్నారు. అయితే సాంకేతిక కారణాలు వల్ల గత 10 రోజులు గా గ్రామానికి తాగునీరు రాకపోవడంతో గ్రామ స్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై గ్రామస్థులు మండిపడు తున్నారు. ఎంతో సందడిగా జరిగే ఉత్స వాల సమయంలో నీటికోసం ఇన్ని ఇబ్బం దులు పడడంపై వారంతా నిట్టూరుస్తున్నా రు. తాగునీటి కోసం కిలోమీటరు దూరం వెళ్లి రావాల్సి వస్తుందని పలు వురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రాజీపేట, కాశీన గర్ గ్రామాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుం టున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు స్పందించి తాగునీ టి సమస్యను పరిష్క రించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.