రూ.80 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:57 PM
పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరి ష్కారానికి చర్యలు చేపడుతు న్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల తాగునీటి సమస్య శాశ్వత పరి ష్కారానికి చర్యలు చేపడుతు న్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం సరుబుజ్జిలి మండలం పురుషో త్తపురం సమీపంలోని వంశ ధార నదీ పరీవాహక ప్రాంతంలో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించా రు. సంబంధిత అధికారులతో పనుల పురో గతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. సమగ్ర తాగు నీటి ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో 23 వార్డుల్లోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరం దించే దిశలో పనులు చేపడుతున్నామన్నారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడు వులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ తమ్మినేని రవి, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా సాగర్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి విద్యా సాగర్, డాక్టర్ చాపర సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.