ప్రతి ఇంటికీ తాగునీరు: రవికుమార్
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:57 PM
పట్టణంలో ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మ న్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నా రు.
ఆమదాలవలస, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు చర్యలు తీసు కుంటున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మ న్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నా రు. మునిసిపాలిటీ పరిధి పదో వార్డు మెట్టక్కివలస వాంబే కాలనీలో రూ. 81.52 లక్షల ఏఐఐబీ నిధులతో చేపట్ట నున్న తాగునీటి అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాథమిక అవసరాలైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వాంబేకాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసర మైన నిధులను మంజూరు చేయించి ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి తాగునీటి సదుపాయం కల్పిం చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం పదో వార్డులో ఇంటిం టికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను వివ రించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్య క్షురాలు టి.సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. రమేష్, టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి టి.విద్యా సాగర్, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ గీతా సాగర్, నాయకులు నాగళ్ల మురళీధర్‌యాదవ్, సిమ్మ మాధవి, శ్రీదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.