Share News

నాటికలు సమాజ చైతన్య వీచికలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:05 AM

సమాజ చైతన్య వీచికలు నాటిక లని, ఇవి ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ అన్నారు.

నాటికలు సమాజ చైతన్య వీచికలు
‘అమ్మచెక్కిన బొమ్మ’ కళాకారులకు షీల్డ్‌ అందిస్తున్న అతిథులు

ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు

కవిటి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): సమాజ చైతన్య వీచికలు నాటిక లని, ఇవి ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీ అన్నారు. బొరివంక గ్రామంలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహ్వానిత తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగి శాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాటికలకు ఆదరణ తగ్గలే దని ఈ పోటీలు నిరూపించాయన్నారు. సమా జంలో జరుగుతున్న సంఘటనలు ఇతివృత్తాలు గా రూపొందించిన నాటికలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయన్నారు. ఉద్దానం కళలకు పుట్టి నిల్లు అని ఈ ప్రాంతంలో కళాకారులకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. అనం తరం కళాపీఠం అద్యక్షుడు బి.లక్ష్మణమూర్తి, సభ్యులు వారిని సత్కరించారు.

ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు..

మూడురోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలలో గోవాడ క్రియేషన్స్‌, హైదరాబాద్‌ వారు ప్రదర్శించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’, ద్వితీ య ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్‌, గుంటూరు వారి ‘సహాన’ నాటిక ఎంపికయ్యాయి. చైతన్య కళా భారతి, కరీంనగర్‌ వారు ప్రదర్శించిన ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటిక జ్యూరీ బహుమతిని అందుకుంది. ఉత్తమ నటుడిగా భానుప్రకాష్‌, ఉత్తమనటిగా కుసుమ సాయి, ఉత్తమ విలన్‌గా అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, ఉత్తమ రచనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ రచయిత్రి జ్యోతిరాజ్‌ బీశెట్టి నిలి చారు. ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా కె.సత్యనారా యణ, ఉత్తమ దర్శకత్వం ఎన్‌.రవీంద్రరెడ్డి కైవ సం చేసుకున్నారు. న్యాయనిర్ణేతలుగా ఎం. సత్య నారాయణ, ఎల్‌.రామలింగస్వామి, బీఏ మోహన రావు వ్యవహరించారు. విజేతలకు నిర్వాహకులు, అతిథులు బహుమతులు అందించి అభినం దించారు.

Updated Date - Apr 07 , 2026 | 12:05 AM