Share News

60 డివిజన్ల రిజర్వేషన్ల ముసాయిదా జాబితా విడుదల

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:49 PM

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లకు సంబం ధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల రిజ ర్వేషన్లు ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

60 డివిజన్ల రిజర్వేషన్ల  ముసాయిదా జాబితా విడుదల
మాట్లాడుతున్న కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లకు సంబం ధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల రిజ ర్వేషన్లు ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ముసాయిదా జాబితా వివ రాలను కమిషనర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల వారీగా రూపొందించిన రిజర్వేషన్లు ముసాయిదా జాబితాను రాజకీయపార్టీల ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీ లించాలని సూచించారు. జాబితాలో అభ్యంతరాలు ఉన్నా, మార్పులకు సంబంధించిన సూచనలు చేయాల్సిఉన్నా నిర్ణీత విధానంలో అధికారు లకు తెలియజేయాలని కోరారు. రాష్ట్రఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ముసా యిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు సమర్పించే విషయంలో పార్టీల ప్రతినిధులు నిబంధనలను పాటించాలని సూచించారు.

సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ ప్రాంతాపై చర్చ

నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై కమిషనర్‌ జి.శ్రావణ్‌కుమార్‌ గురు వారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాలసిన చర్యలు సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సి టివ్‌ ప్రాంతాల గుర్తింపు, పోలీస్‌ సిబ్బంది అవసరం తదితర అంశాలపై వన్‌టౌన్‌, జీఆర్‌పురం సీఐలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. 60 డివిజన్లకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఆయా ప్రాం తాలు ఏయే పోలీస్‌స్టేషన్లు పరిధిలోకి వస్తాయి, ఎన్నికల విధులు నిర్వ హణకు ఎంతమంది పోలీస్‌ సిబ్బంది అవసరముతారన్న అంశాలపై సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, ఓటర్లకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చర్యలు, ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అంశాలు పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్‌, నగరపాలక సంస్థ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో ప్రణాళిక రూపొందించా రు. ఎన్నికలసమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సమావేశంలో శ్రీకాకుళం వన్‌టౌన్‌, టూటౌన్‌, జేఆర్‌పురం సిఐలు రామకృష్ణ, ఈశ్వరరావు, అవతారం పాల్గొన్నారు.

హోటళ్లలో ఆహార పదార్థాల తనిఖీ

అరసవల్లి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో వివిధ హోటళ్లలో ప్రజలకు అమ్ముతున్న ఆహార పదార్థాల పరిశుభ్రతపై ఆహార భద్రత అధికారులు గురువారం తనిఖీ నిర్వహించారు. తుఫాన్‌ పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందజేస్తున్న ఆహారం, తాగునీరు పరిశుభ్రమైనవో కావో తెలుసుకోడానికి అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ సీహెచ్‌ లక్ష్మీనారాయణ, ఫుడ్‌ సేప్టీ అధికారి కె.లక్ష్మి తని ఖీలుచేపట్టారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రమైన ఆహారమే వినియోగదారులకు అందించాలని హోటల్‌ పరిశ్రమ నిర్వాహకుల కు అవగాహన కల్పించారు. హోటల్‌ వ్యాపారం నిర్వహించేవారికి తగిన లైసెన్స్‌లు తప్పనిసరి అని స్పష్టంచేశారు.

Updated Date - Oct 29 , 2026 | 11:49 PM