పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:51 PM
పురపాలక సంఘ పరిధి లోని 28 వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు కమిషనర్ తమ్మినేని రవి తెలి పారు.
అభ్యంతరాలకు నేటి సాయంత్రం వరకు గడువు
ఆమదాలవలస మునిసిపల్ కమిషనర్ తమ్మినేని రవి
ఆమదాలవలస, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘ పరిధి లోని 28 వార్డులకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు కమిషనర్ తమ్మినేని రవి తెలి పారు. ఈ మేరకు మునిసిపల్ కార్యాలయంలో ముసాయిదా జాబితాలను సోమవారం ప్రదర్శించారు. అలాగే కలెక్టర్, శ్రీకాకుళం ఆర్డీవో, ఆమదాల వలస, శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయాలు, ఆమదాలవలస సబ్ రిజి స్ర్టార్ కార్యాలయం, సబ్ కోర్టు, ఆమదాలవలస పోస్టాఫీస్‌లలో ఈ జాబి తాలను ఉంచినట్లు తెలిపారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలున్నా మంగళ వారం సాయంత్రం ఐదు గంటల్లోగా తెలియజేయాలన్నారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎమ్మెల్యే తో సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు మునిసిపల్ కార్యా లయంలో నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం అందిన అభ్యంతరా లను పరిశీలించి 28న జాబితాను కలెక్టర్ ఆమోదానికి పంపించను న్నామ న్నారు. 29న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తామన్నారు.