వరకట్నం సాంఘిక దురాచారం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:56 PM
వరకట్నం సాంఘిక దురాచార మని, వరకట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, ఏప్రిల్ 17 (ఆంధ్ర జ్యోతి): వరకట్నం సాంఘిక దురాచార మని, వరకట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. కార్పొ రేషన్‌పరిధి కిల్లిపాలెం గ్రామంలో శుక్రవారం న్యాయ విజ్జాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కట్నం ఇవ్వడం ఒకప్పుడు సంప్రదాయం గానో అనవాయితీ గానో ఉండేదని, కాని ఇప్పుడు అది నేరమన్నారు. కార్యక్రమంలో పోక్సో న్యాయస్థానం న్యాయాధి కారి ఎన్.సునీత, దిశ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.నారీమణి, పాఠశాల హెచ్‌ఎం జి.శశికళ, వై.హిమబిందు, బాడాన దే వభూషణ్‌రావు పాల్గొన్నారు.