జూలై 14 వరకు సర్‌పై ఇంటింటి సర్వే: ఆర్డీవో
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:48 PM
భారత ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు నియోజకవర్గంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026’ ప్రక్రియ ప్రారంభమైందని ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు నియోజకవర్గంలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026’ ప్రక్రియ ప్రారంభమైందని ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేసి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తా రన్నారు. ఓటర్లు తమ ఆధార్, ఫోన్ నంబర్, కలర్ ఫొటోతో ఫారమ్ పూర్తి చేసి తిరిగి ఇవ్వాల న్నారు. ఆన్‌లైన్‌లో (వోటర్స్.ఈసీఐ.జీవోవీ.ఇన్ లేదా ఈసీఐఎన్‌ఈటీ యాప్ ద్వారా) కూడా వివరాలు నమోదు చేసు కోవచ్చని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారి పేర్లు ముసాయిదా జాబితా లో ఉండవన్నారు. జూలై 21న ముసాయి దా ఓటర్ల జాబితా, సెప్టెంబరు 22న తుది జాబితా ప్రచురిస్తామన్నా రు. ఈ పారదర్శక ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ఓటర్లు సహకరించా లని కోరారు. సమావేశంలో అర్బన్ ఏసీపీ జానకి, ఎన్నికల డీటీ శ్రీని వాసరావు, టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, శంకర్, వేణుగోపాల్ (బీజేపీ), భాస్కర్ (జనసేన), ఈశ్వరి (కాంగ్రెస్), ఐటీ కుమార్ (వైసీపీ) తదితరులు పాల్గొన్నారు.