Share News

తలుపులు విరిగిపోయి.. విద్యుత్‌ సామగ్రి చోరీకి గురై

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:45 PM

పాతపట్నం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహ ప్రారంభోత్సవానికి ఐదేళ్లుగా విద్యార్థినులు నిరీక్షిస్తు న్నారు. పనులు పూర్తయినా వినియోగంలోకి రాకపోవ డంతో తలుపులు విరిగిపోయాయి. విద్యుత్‌సామగ్రి చోరీకి గురయ్యింది.

తలుపులు విరిగిపోయి..  విద్యుత్‌ సామగ్రి చోరీకి గురై
ప్రారంభానికి నోచుకోని బాలికల వసతిగృహం:

పాతపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): పాతపట్నం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహ ప్రారంభోత్సవానికి ఐదేళ్లుగా విద్యార్థినులు నిరీక్షిస్తు న్నారు. పనులు పూర్తయినా వినియోగంలోకి రాకపోవ డంతో తలుపులు విరిగిపోయాయి. విద్యుత్‌సామగ్రి చోరీకి గురయ్యింది.

పాతపట్నంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో 553 మందికిగాను వారిలో 270మందికి పైబడి విద్యా ర్థినులు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నా రు. ఈమేరకు బాలికలకోసం రూ.2.65కోట్ల రూసా నిధులతో ఏపీఈడబ్ల్యూఏఎస్‌ చేపట్టిన బాలికల వసతి గృహనిర్మాణం 2019లో పూర్తయ్యింది. అయితే వసతి గృహనిర్మాణానికి ప్రహరీ లేకపోవడంతో బాలికలకు రక్షణ దృష్ట్యా ఈ భవనంలో వసతిగృహ నిర్వహణ సాధ్యపడదని అధికారులు ప్రారంభోత్సవానికి విము ఖత చూపి జాప్యంచేశారు. దీంతో మళ్లీ ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరుచేయడంతో ప్రహరీ నిర్మా ణం కూడా పూర్తిచేశారు. ఈలోగా భవనంలోని ఫర్నీ చర్‌, విద్యుత్‌సామగ్రి, తలుపులు చోరీకి గురయ్యాయి. భవనంలో పలుచోట్ల పాడయ్యాయి. మిగిలిఉన్న లోపల తలుపులు, ద్వార బందాలకు కూడా చెదలు పట్టాయి. దెబ్బతిన్న భవనంలో బాలికల వసతిగృహ నిర్వహణ సాధ్యంకాదనిపేర్కొని అధికారులు వసతి గృహం ప్రారంభానికి ముందుకురాలేదు. ఈ నేపథ్యం లో మరమ్మతులకు కనీసం రూ.ఆరు లక్షల వరకూ అవసరమని, ఈవిషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ప్రిన్సిపాల్‌ కె.చక్రపతి తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవచూపి మర మ్మతులు పూర్తిచేయించి ప్రారంభించి బాలికల వసతిగృహం వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 11:45 PM