ఇంధన సరఫరాలో అంతరాయం రానివ్వొద్దు
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:13 AM
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై పర్యవేక్షణ ఉండాలి
బంకుల పరిస్థితిపై తక్షణమే నివేదికలివ్వండి
కలెక్టర్లకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
సింగపూర్ నుంచి టెలీకాన్ఫరెన్స్
శ్రీకాకుళం, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాల్లో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆయన సింగపూర్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మూడు జిల్లా ల్లోని ఇంధన డిమాండ్, సరఫరా లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లా డుతూ.. సర ఫరా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అధికారులు అప్రమత్తంగా ఉండి ముం దస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వ్యా ప్తంగా ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఏ మేర ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని సూచిం చారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇంధన పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా చూడాలన్నారు. బంకుల ప్రస్తుత పరిస్థితిపై వెంటనే తనకు సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఆందోళన వద్దు.. ఇబ్బంది రానివ్వం
పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదం తులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఇంధన సరఫరా విషయంలో ప్రజలు ఎటు వంటి ఇబ్బందులకు గురికా కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వాహనదారులు, ప్రజలు ఆందోళనకు గురై ముందస్తు అవస రాల నిమిత్తం భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.