తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:27 PM
తాగునీటి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): తాగునీటి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శుక్రవారం నగరంలోని తాగునీటి సరఫరా పంప్ హౌస్‌లను ఆయన అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్‌తో కలిసి ఆకస్మికం గా తనిఖీచేశారు. ఏఎస్‌ఎన్ కాలనీలోని పంప్ హౌస్, ఆదివారం పేట వాటర్ వర్క్స్ ప్లాంట్ ను పరిశీలించారు. బలగలోని హెడ్ వాటర్ వర్క్స్ విభాగాన్ని తనిఖీ చేసి నీటి శుద్ధీకరణ ప్రక్రి యను, క్లోరినేషన్ స్థాయిలను తనిఖీ చేశారు. రామలక్ష్మణ జంక్షన్, ప్రభాకర్ నగర్ వీఽధుల్లో పర్యటించి పారిశుధ్య పనులపై సిబ్బందికి సూచ నలిచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. పైపులైన్ల లీకేజీలను తక్షణమే అరికట్టాలని ఆదేశించారు.