హెల్మెట్ వాడకంలో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో
ABN , Publish Date - May 07 , 2026 | 12:28 AM
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సూచించారు.
టెక్కలి, మే 6(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సూచించారు. అభయం హెల్మెట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం టెక్కలిలో అవగాహన ర్యాలీ నిర్వ హించారు. ఈ ర్యాలీని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు ప్రారంభిం చారు. పాతజాతీయ రహదారి డిగ్రీ కళాశాల నుంచి ఇందిరాగాంధీ జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగించి ప్రజల్లో రోడ్ల భద్రత, హెల్మెట్ ప్రాముఖ్యతపై వివరించారు. హెల్మెట్ లేని వాహనచోదకుల్ని గుర్తించి అభయం హెల్మెట్ బ్యాంక్ ద్వారా హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు 20శాతం వరకు పోలీసులు తగ్గించారని, హెల్మెట్ ధరించ కపోతే రూ.1,035 అపరాధ రుసుం విధిస్తారని తెలిపారు. డీఎస్పీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. గత రెండేళ్ల గణాంకాలు పరిశీలిస్తే వాహనచోదకులు హెల్మెట్లు ధరించకపోవడం వలనే పలువురు రోడ్డు ప్రమాదాలు బారిన పడుతున్నారని, అందువలన హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సీఐలు ఎ.విజయ్‌కుమార్, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.