కార్గో ఎయిర్ పోర్టు అని అపోహలు వద్దు
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:10 AM
పలాస నియోజక వర్గంలో ఏర్పాటయ్యేది కార్గో ఎయిర్ పోర్టు అన్న అపోహలు వద్దని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు పేర్కొన్నారు.
శ్రీకాకుళం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజక వర్గంలో ఏర్పాటయ్యేది కార్గో ఎయిర్ పోర్టు అన్న అపోహలు వద్దని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మో హన్‌నాయుడు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నిర్వాసిత 18 గ్రామాల ప్రజలు, నిర్వాసితులతో ఆదివారం కలెక్టరేట్‌లో ఆది వారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎస్పీ మహేశ్వరరెడ్డి సమ క్షంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి రామ్మోహన్ నాయుడు వర్చువ ల్‌గా పాల్గొని మాట్లాడారు. ‘గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా.. దూర ప్రాంతాలకు వెళ్లినా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు ఇతర పోర్టుల వద్ద కూడా శ్రీకాకుళం జిల్లావారు తారసపడు తున్నారు. తమను జిల్లాకు తీసుకురావాలని కోరుతున్నారు. ఎయిర్‌పోర్టు పలాసలో ఏర్పాటైతే ఇటువంటి వారికి సహా యం చేసేందుకు వీలుంటుంది.. ఎట్టిపరిస్థితుల్లోనూ కార్గో ఎయిర్‌పోర్టు అని అపోహలు పెట్టుకోవద్దు. వలసల నివా రణకు, స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలంటే.. విశాఖతో సమానంగా అభివృద్ధి చెందాలంటే మన జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటైతే అనుబంధ పరిశ్రమలు వస్తాయి’ అని వివ రించారు. రాష్ట్ర మంత్రి కిజంరాపు అచ్చె న్నాయుడు మాట్లా డుతూ.. నిర్వాసితులకు శతశాతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం వర్తి స్తుందని.. ఏ ఒక్క రైతుకు, నిర్వాసితులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు ఏర్పాటైతే చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వలసల నివారణలో ముఖ్యభూమిక పోషిస్తుందని, పర్యావరణానికి హితం కాని పరిశ్రమలు వస్తాయన్న ప్రచారం అవాస్తవ మన్నారు. ఒడిశా రాష్ట్రం బరంపురం తరలిపోవాల్సిన ఎయిర్ పోర్టును రామ్మోహన్‌నాయుడు ఇక్కడికి తీసుకువచ్చార న్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. మెట్టూరు, అనకాపల్లి, బిడిమి, రాంపురం, టి.గంగు వాడ పంచాయతీల్లో 18 గ్రామాల పరిధిలో సుమారు 1458 మంది రైతులను గుర్తించడం జరి గిందని.. ఇందులో 1330 ఎకరాల భూమి ఉండగా దీనిలో 1000 ఎకరాలు జిరాయితీ, 330 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందన్నారు. రెవెన్యూ రికా ర్డులను కూడా సరిదిద్ది రైతులకు న్యాయం చేస్తామన్నారు. మూడు దఫాలుగా సర్వే చేసిన అనంతరం మంత్రుల వద్దకు ఫైల్‌ను పంపి.. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లా డుతూ.. రైతులు, నిర్వాసితులు ఎన్ని దఫాలైనా విన తులు ఇవ్వవచ్చని, ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించ వచ్చని.. అయితే సంబంధం లేని వ్యక్తులు మాట్లాడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రైతుల తరఫున, నిర్వాసితుల తరఫున ఉంటామని.. బయట వ్యక్తుల విషయంలో నిఘా ఉంటుందని వెల్లడించారు. నిర్వాసితులు, రైతులు మాట్లాడుతూ.. పరి హారం అందించే విషయంలో ఉదారత చూపించాలని, పూర్తిస్థాయిలో ఏ విధంగా న్యాయం చేస్తారు.. నిర్వాసితులకు ఏ విధమైన భద్రత కల్పిస్తారు.. దూరప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న నిర్వాసితులను ఎలా తెప్పించి సహాయం అందిస్తారన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానం కావాలని కోరారు. కచ్చితంగా నిర్వాసితులందరికీ న్యాయం చేసి.. ఆపై జాబితా ప్రకటించిన తరువాతే పోర్టు పనులు వేగవంతమవుతాయని ప్రజాప్రతి నిధులు, అధికారులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, కూట మి ప్రభుత్వానికి చెందిన అనుకూల రైతులే అధికమంది పాల్గొన్నారు.