శ్రీకూర్మక్షేత్రంలో డోలోత్సవం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:40 PM
శ్రీకూర్మక్షేత్రంలో డోలోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత గోవందరాజస్వామివారిని మేళతాళాలతో తిరువీధిగా డోల మండపానికి అర్చకులు తీసుకెళ్లి అక్కడ ఊయల్లో ఉంచారు.
గార, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మక్షేత్రంలో డోలోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత గోవందరాజస్వామివారిని మేళతాళాలతో తిరువీధిగా డోల మండపానికి అర్చకులు తీసుకెళ్లి అక్కడ ఊయల్లో ఉంచారు. ఈ సందర్భంగా స్వామివారికి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు విజయనగర పూసపాటి గజపతుల గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక ఊజలు నిర్వహించారు. అనంతరం స్వామిని భక్తులు ఉత్తరాభిముఖంగా దర్శించుకొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు చామర్ల సీతారామ నరసింహాచార్యులు వైదిక కార్య క్రమాన్ని నిర్వహించారు. అలాగే భక్తులకు శ్రీకూర్మం నవజీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు.