ప్రియాగ్రహారంలో డోలో పౌర్ణమి ఉత్సవాలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:57 PM
:ప్రియాగ్రహారంలోని లలిత త్రిపురాంతకవిశ్వేశ్వరస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మూడురోజులపాటు నిర్వహించే డోలో పౌర్ణమి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ బెవరనూకరాజు, మాజీ సర్పంచ్ లావేటికృష్ణ, ఎంపీటీసీ సుంకరిప్రసాదరావు, యువజన, మహిళాసంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళలు కలశాలతో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు.
పోలాకి, మార్చి 3(ఆంధ్రజ్యోతి):ప్రియాగ్రహారంలోని లలిత త్రిపురాంతకవిశ్వేశ్వరస్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మూడురోజులపాటు నిర్వహించే డోలో పౌర్ణమి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ బెవరనూకరాజు, మాజీ సర్పంచ్ లావేటికృష్ణ, ఎంపీటీసీ సుంకరిప్రసాదరావు, యువజన, మహిళాసంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళలు కలశాలతో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. త్రిపుర సుందరి మండపం వద్ద కుంకుమార్చన, హరతి కామదహనంకార్యక్రమాలు పురోహితులు రమణశర్మ నిర్వహించారు. గుల్లవానిపేట పోలేరమ్మ బాలికల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. మండలస్ధాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. విద్యుత్‌దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశామని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు చెప్పారు.