Share News

ఆమదాలవలసలో కుక్కల స్వైర విహారం

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:46 AM

ఆమదాలవలస పట్టణంలోని స్థానిక తహసీలార్‌ కార్యాలయం రోడ్డులో ఆదివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి.

ఆమదాలవలసలో కుక్కల స్వైర విహారం
గుంపుగా సంచరిస్తున్న వీధి కుక్కలు

  • పది మందికి గాయాలు

  • ఆందోళనలో పట్టణ ప్రజలు

ఆమదాలవలస, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పట్టణంలోని స్థానిక తహసీలార్‌ కార్యాలయం రోడ్డులో ఆదివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆ రోడ్డులో రాక పోకలు సాగిస్తున్నవారిపై దాడి చేయడంతో పది మంది గాయపడ్డారు. పట్టణానికి చెందిన పాలవలస కృష్ణ, కె.జాన్‌, గొల్లపల్లి రామారావుతోపాటు ఇతర గ్రామాలకు చెందిన మరో ఏడుగురు గాయపడ్డారు. వీంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కండ్రవీధి, పూజారిపేట, పాతనివానిపేట, గణేష్‌నగర్‌, ఐజే నాయుడు కాలనీ, కొత్తకోట వారివీధి ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు కుక్కలదాడితో వీరంతా ఆందోళన చెందుతున్నారు. వీధి కుక్కలను నివారించాల్సిన మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:46 AM