Share News

వైద్యులు అందుబాటులో ఉండాలి: డీసీహెచ్‌ఎస్‌

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:53 PM

వైద్యులు ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డీసీహెచ్‌ఎస్‌ కేఎన్‌ విజయలక్ష్మి కోరారు.

 వైద్యులు అందుబాటులో ఉండాలి: డీసీహెచ్‌ఎస్‌
నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది అటెండెన్స్‌ రిజస్టర్‌ను పరిశీలిస్తున్న డీసీహెచ్‌ఎస్‌ విజయలక్ష్మి

నరసన్నపేట, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): వైద్యులు ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని డీసీహెచ్‌ఎస్‌ కేఎన్‌ విజయలక్ష్మి కోరారు. మంగళవారం నరసన్నపేట ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. విధుల్లో చేరిన రెండోరోజు నరసన్నపేట ఆసుపత్రిలో వైద్యులు హాజరు, చైల్డ్‌వార్డును పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే సమయానికి కొందరు వైద్యులు, సిబ్బంది బయటకు వెళ్లగా డీసీహెచ్‌ఎస్‌ తనిఖీ చేస్తున్నారని సమాచారం మేరకు ఉరుకులు..పరుగులతో చేరారు. అనంతరం వైద్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. నిబంధనలు మేరకు ఆసుపత్రిలోనే వైద్యులు, సిబ్బంది ఉండాలని, హాజరు వేసి సొంత క్లినిక్‌లకు వెళ్లరాదని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌బాబు, వైద్యులు రమేష్‌, రెడ్డి భార్గవ్‌, మెండ సుధారాణి, చల్లా కృషి పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:53 PM