Share News

జీడిపప్పునకు పన్నుపై ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:40 AM

జీడి పప్పునకు సంబంధించిన పన్నుపై వ్యాపారులు ఆందోళన చెందవద్దని, సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, మా ర్కెటింగ్‌ కమిటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రాజశేఖర్‌, రవిసుభాష్‌లను కలు సుకొని సమస్యలు విన్నవించామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

జీడిపప్పునకు పన్నుపై ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే
మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సమస్యను వివరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష, వ్యాపార సంఘ ప్రతినిధులు

పలాస, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): జీడి పప్పునకు సంబంధించిన పన్నుపై వ్యాపారులు ఆందోళన చెందవద్దని, సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ, మా ర్కెటింగ్‌ కమిటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు రాజశేఖర్‌, రవిసుభాష్‌లను కలు సుకొని సమస్యలు విన్నవించామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాజధాని అమరావతిలోని సచి వాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీలను కలుసుకొని జీడి వ్యాపారులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతు తాము చేసిన విన్నపాలపై అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. జీడి పప్పుపై ఒక శాతం సెస్‌ వసూలు అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించామన్నారు. దీనిపై వ్యాపారులకు ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి జీడిపప్పుపై సెస్‌కు సంబంధించి జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, పలాస జీడి వ్యాపారుల సంఘ ప్రధాన కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, నాయకులు వాసు, ఫణిరాఘవులు, సుబ్బారాయులు ఎమ్మెల్యేతో పాటు వెళ్లి అధికారులను కలిశారు. పలాస జీడికి మంచి భవిష్యత్తు ఉందని, రానున్న రోజుల్లో దేశంలో అగ్రగామిగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శిరీష పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:40 AM