Share News

‘రుణాల కోసం ఎవరికీ కమీషన్లు ఇవ్వొద్దు’

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:08 AM

రుణాలు పొందే స్వయంశక్తి సంఘాల మహిళలు ఎవరికీ కమీషన్లు, ఖర్చుల కోసం నగదు ఇవ్వవద్దని వెలుగు గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్‌ పీడీ పి.కూర్మారావు స్పష్టం చేశారు.

 ‘రుణాల కోసం ఎవరికీ కమీషన్లు ఇవ్వొద్దు’
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీడీ కూర్మారావు

మందస(పలాస), నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రుణాలు పొందే స్వయంశక్తి సంఘాల మహిళలు ఎవరికీ కమీషన్లు, ఖర్చుల కోసం నగదు ఇవ్వవద్దని వెలుగు గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్‌ పీడీ పి.కూర్మారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన మందస మండలం వీరభద్ర గ్రామంలో మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన డబ్బులు-మన లెక్కలు, సూపర్‌నారీ యాప్‌ ద్వారా సంఘాల్లో లెక్కలు పారదర్శకంగా తెలుసుకోవచ్చన్నారు. నారీ యాప్‌ల వినియోగంపై పది సంఘాల్లో ఒకరికి శిక్షణ ఇచ్చామన్నారు. మండలంలో కొన్ని మహిళా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ రుణాలు ఇచ్చే సమయంలో కమీషన్లు ఇవ్వవద్దన్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా మహిళలకు కేవలం రూ.92 పైసల వడ్డికే రుణాలను ఇస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో ఈ రుణాలను అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించామన్నారు. సంఘాల మహిళలు పంచసూత్రాలు పాటించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్‌ మీనాక్షి, మోహిని, కృష్ణవేణి, శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:08 AM