తహసీల్దార్ కార్యాలయాన్ని తరలించవద్దు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:38 AM
ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాల యాన్ని మరోచోటుకు తరలించవద్దని హిరమండలం పంచాయతీలోని వ్యాపారులు, స్థానికులు కోరారు.
హిరమండలం, మార్చి 30, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాల యాన్ని మరోచోటుకు తరలించవద్దని హిరమండలం పంచాయతీలోని వ్యాపారులు, స్థానికులు కోరారు. ఈమేరకు సోమవారం తహసీల్దార్ బాలకృష్ణ, ఎంపీడీవో కాళీ ప్రసాద్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం నిర్మాణానికి రూ.1.30 కోట్లు ఇటీవల మంజూరుకావడంతో ఎకరా స్థలం కావాల్సి ఉందని చెప్పారు. స్థానికంగా అంత స్థలం ఎక్కడా లేదని పేర్కొని బ్యారేజీ సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలంలో భవనాలు నిర్మా ణం చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే వంశధార రిజర్వాయర్ నిర్మాణం వల్ల వ్యాపారాలు లేకుండాపోయాయిని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం బ్యారేజీ సెంటర్‌కు తరలిస్తే ప్రస్తుతం జరుగుతున్న వ్యాపా రాలు కూడా పడిపోయి వలసవె ళ్లాల్సి వస్తుందని వాపోయారు. హిరమండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూమి ఉందని, అక్కడ తహసీల్దారు కార్యాలయం నిర్మాణం చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యారేజీ సెంటర్‌కు తరలిస్తామంటే ఉద్యమ చేపట్టడా నికి వెనుకాడబోమని హెచ్చరించారు.